septembar 28th, 2015 current affairs

సెప్టెంబర్ 28, 2015

కరెంట్ అఫైర్స్

సోమవారం

1) సెప్టెంబర్ 28, 2015 న న్యూయార్క్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ  ప్రధానంగా ఏ మార్పుల పైన ఫ్రాన్స్ అద్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే , బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ , అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా తో వరుస బేటీలు నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు జరిపారు?

ఎ) అంతర్జాతీయ  ఉగ్రవాదం, వాతావరణ మార్పుల పైన

బి) రక్షణ  వ్యవస్థ

సి) ఆర్ధిక సన్నిహిత సంబంధాలు

 డి) ఏదీ కాదు

జవాబు:  అంతర్జాతీయ  ఉగ్రవాదం, వాతావరణ మార్పుల పైన 

2) సెప్టెంబర్ 28, 2015 న భారత తొలి స్పేస్ రీజెర్చ్ అబ్జర్వేటరీ ఆస్ట్రోశాట్ తో పాటు ఎన్ని విదేశీ ఉపగ్రహాలను  షార్  నుండి పీ ఎస్ ఎ ల్వీ -సీ 30  అంతరిక్ష వాహన నౌక సహాయం తో ఇస్రో ప్రయోగించి విజయం సాధించినది?

ఎ) ఐదు బి) ఆరు సి) నాలుగు డి) మూడు

జవాబు: ఆరు

వివరణ: సెప్టెంబర్ 28, 2015 న ఆంద్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఉదయం 10 గంటలకు ఈ ప్రయోగాన్ని 31 వ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ( పీ ఎస్ ఎల్ వీ ) – సీ 30 అంతరిక్ష వాహన నౌక సహాయం తో  ఇస్రో శాస్త్రవేత్తలు  ప్రయోగించినారు.

 షార్ కేంద్రం నుండి నింగి కెగిసిన 25 నిమిషాల తర్వాత ఆస్ట్రోషాట్  సహా అమెరికా, ఇండోనేషియా , కెనెడా దేశాలకు చెందిన ఆరు ఉపగ్రహాలను పీ ఎస్ ఎల్ వీ -సీ 30 రాకెట్ విజయవంతంగా కక్ష్య లోని కి  ప్రవేశబెట్టినది.

పీ ఎస్ ఎల్ వీ ప్రవేశబెట్టిన అంతరిక్ష ఉపగ్రహం కేవలం దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ సాంకేతిక ,శాస్త్ర , పరిశోధన రంగ సమాజానికి సమాచారం అందిస్తదని  ఇస్రో చైర్మన్ ఏ ఎస్ కిరణ్ కుమార్  ప్రయోగం అనంతరం మాట్లాడారు.  

ఇప్పటి వరకు రీసెర్చ్ అబ్జర్వేటరీ తరహా ప్రయోగాలను అమెరికా, జపాన్ , రష్యా , యూరప్ లు మాత్రమే చేబట్టినాయి, తాజాగా ఆస్ట్రొశాట్ ప్రయోగం విజయవంతం కావడం తో భారత్ కూడా ఆ దేశాల సరసన చేరింది.

అమెరికా కు చెందిన ఓ ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి.

అమెరికా కు చెందిన నాలుగు లేమూర్ నానో ఉపగ్రహాలు , ఇండోనేషియా కు చెందిన ఎల్ ఏ పి   ఏ ఎన్ -ఏ 2 , కెనడా కు చెందిన ఎన్ ఎల్ ఎస్ -14 ( ఈవీ 9) నానో శాటిలైట్  ను అంతరిక్షం లోని కి ఇస్రో ప్రవేశబెట్టినది.

ఇప్పటి వరకు  జర్మనీ , ఫ్రాన్స్ ,జపాన్, కెనెడా , యూకే తో పాటు మొత్తం 20 దేశాలకు చెందిన ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశబెట్టినది.  తాజాగా ప్రయోగం తో భారత్ ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 51 కి  చేరినది.

                                                          కేవలం 178 కోట్లు వ్యయం తో ఇస్రో 10 సంవత్సరాలు శ్రమించి ఆస్ట్రొశాట్ ఉపగ్రహాన్ని రూపొందించినది.దీని బరువు 1513 కిలోలు ( ఆరు విదేశీ ఉపగ్రహాల బరువు 118 కిలోల తో కలిపి) వుంది.   శాస్రీయంగా రూపొందించె ఉపగ్రహాలు పరిమిత శ్రేణి లో వేవ్ లెంగ్త్ బ్యాండ్ ను పరిశీలించే  సామార్ధ్యాన్ని కలిగి వుంటాయి  వాటికి భిన్నంగా ఎలెక్ట్రో మ్యాగ్నటిక్ స్పెక్ట్రం లోని ఆప్టికల్ ఆల్ట్రావ్యిలెట్ , లో అండ్ హై ఎనర్జీ ఎక్స్ రే ప్రాంతాలను గమనించే సామర్ధ్యం ఆస్ట్రోశాట్ కు ఉంది.

3) సెప్టెంబర్ 28, 2015 న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొండా లక్ష్మణ్ బాపూజీ ( తెలంగాణ తొలి , మలి ఉద్యమాలకు వారధి గానిలిచిన మహనీయుడు) ఎన్నవ జయంతి ఉత్సవాలను  జరుపుకున్నారు?

ఎ) 86 వ జయంతి బి) 100  ( శత )  జయంతి  సి)   97 వ జయంతి  డి) 85 వ జయంతి

జవాబు : 100  ( శత )  జయంతి 

4) సెప్టెంబర్ 28, 2015  న్యూ ఢిల్లీ లో  జరిగిన అసియా  ఎయిర్  గన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత్ ఖాతా లో ఎన్ని పతకాలు చేరాయి?

ఎ)  ఒక స్వర్ణం, ఒక  రజతం , మూడు కాంస్యాలు

బి) ఒక రజతం,  రెండు కాంస్యాలు

సి) రెండు  స్వర్ణాలు , రెండు రజతాలు

డి)  ఒక స్వర్ణం,  రెండు రజతాలు, రెండు కాంస్యాలు

జవాబు: ఒక స్వర్ణం, ఒక  రజతం , మూడు కాంస్యాలు

వివరణ: మహిళల 10 మీటర్ల ఎయిర్  రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్ లో భారత్ షూటర్ అయోనికా పాల్ 185.0 పాయింట్లతో మూడో స్థానం లో నిలిచి కాంస్య పతకం సాధించగా, 10 మీ. ఎయిర్  రైఫిల్ యూత్ కేటగిరీ లో భారత అమ్మాయి ఆశీ  రస్తోగీ పసిడి సాధించినది, ఇక కాంస్య పతకాన్ని ప్రాచి గడ్కరీ దక్కించుకున్నది.  

5) చైనా రాజధాని బీజింగ్ వేదికాగా ఇటీవల జరిగిన ఆసియా రోమింగ్ చాంపియన్షిప్ లో భారత్ ఎన్ని పతకాలు సాధించినది?

ఎ) ఐదు  బి) ఆరు సి) ఏడు డి) తొమ్మిది

జవాబు;   ఏడు

 వివరణ: వీటిలో ఐదు రజతాలు , రెండు కాంస్యాలు   ఉన్నాయి.

 వ్యక్తి  గత స్కల్స్ విభాగం లో దత్తు ,టీం ఈవెంట్ళ లో  జస్వీందర్ సింగ్  , మహమ్మద్ , కపిల్ శర్మ , రాజేశ్  వర్మ , సోను నారాయణ్ లు పతకాలు అందుకున్న వారిలో వున్నారు.

6) సెప్టెంబర్ 28, 2015 న భూగోళ వాసుల్ని అలరించిన  సూపర్ మూన్ తో  భూమికి, చంద్రుడికి  మద్య సగటు దూరం ఎంత  గా  శాస్త్రవేత్తలు నిర్ధారించారు?

ఎ) 3,56,800 కిలో మీటర్లు

బి) 4,23, 767 కిలో మీటర్లు

సి) 3,46, 700 కిలో మీటర్లు

డి) 3, 66, 600 కిలో మీటర్లు

జవాబు : 3,56,800 కిలో మీటర్లు

వివరణ:  సెప్టెంబర్ 28, 2015 న సాధారణం కంటే 12 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా చంద్రుదు కనిపించినారు.  మామూలుగా భూమికి,చంద్రుడికి  మధ్య దూరం 3, 84, 400 కిలో మీటర్లు వుంటుంది.

6) ఏ రాష్ట్ర చిఫ్ విజిలెన్స్ అధికారిగా పౌర సరఫరాల శాఖ కమీషనర్ రజత్ కుమార్ సెప్టెంబర్ 28, 2015 న నియమించబడినారు?

ఎ) ఆంద్ర ప్రదేశ్ బి) తెలంగాణ సి) కర్ణాటక డి) మద్య ప్రదేశ్

జవబు: తెలంగాణ 

7) టాలీవుడ్ కథా నాయకుడు మహేశ్ బాబు ఇటీవల తెలంగాణ రాష్ట్రం లో ని మహబూబ్ నగర్ జిల్లా  లోని ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు?

ఎ) పాలకూరు బి) జడ్ చర్ల సి) సిద్దా పూర్  డి) చెల్లాయి గూడెం

జవాబు; సిద్దా పూర్  

click on  importnat links 

 

Comments are closed.

Scroll To Top
shared on wplocker.com