july 2nd, 2015 telugu current affairs

జులై 1, 2015

కరెంట్ అఫైర్స్

బుధవారం

1)జులై 1 న డిల్లీ లో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంబించినది క్రింది వారిలో ఎవరు ?

ఎ)అరున్ జైట్లీ బి) నరేంద్ర మోదీ సి) రవి శంకర్ ప్రసాద్ డి)వెంకయ్య నాయుడు

జవాబు : నరేంద్ర మోదీ

వివరణ : డిజిటల్ ఇండియా అంటే భారత్ ను ఎలక్ట్రానిక్ పరంగా సాధికారత సాధించిన సమాజంగా తీర్చిదిద్దే కార్యక్రమం. దీనితో ప్రబుత్వ సేవలు పౌరులకు ఎలక్ట్ర్రానిక్ రూపంలో అందుబటులోనికి వస్తాయి.ఇందులో ఒకే వేదిక క్రింద విభిన్న కార్యక్రమాలు వుంటాయి.మొత్తం ప్రభుత్వ వ్యవహారలన్ని సమన్వయ రీతిలో పౌ రులకు అందుబాటులోనికి వచ్చి సుపరిపాలనను సుసాద్యం చేస్తాయి.

2)తల్లి నుండి బిడ్డకు హెచ్ ఐ వీ, సిఫిలస్ జబ్బుల వ్యాప్తిని నిర్మూలించిన మొట్టమొదటి దేశంగా ఏ దేశం అవతరించినదని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది?

ఎ) పాకిస్థాన్ బి) భారత్ సి) క్యూబా డి)బెల్జియం

జవాబు: క్యూబా

వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన సంచాలకులు = మార్గరేట్ చాన్

3) ఏ పేరుగల విద్య తో సమాజంలో మానవ విలువలు పెంపొందించడంలో విశేష క్రుషి చేస్తున్న ఆద్యాత్మిక గురువు రవి శంకర్ ను పెరూ తమ దేశ అత్యున్నత  ‘ మెడెల్లా డి లా ఇందియన్ కమ్యూ నిటీ ఇన్ పెరూ’  అవార్డ్ తో ఇటీవల సత్కరించినది?

ఎ) ఆర్ట్ ఆఫ్ లివింగ్ బి) ఆర్ట్ ఆఫ్ స్మైలింగ్ సి) ఆర్ట్ ఆఫ్ లాఫింగ్ డి) ఏదీ కాదు

జవాబు : ఆర్ట్ ఆఫ్ లివింగ్

4)న్యూడిల్లీ లో జూన్ 30 న ముగిసిన  కామన్వెల్త్ చెస్ చాంపియన్షిప్ లో అండర్ -14 విభాగంలో హైదరాబాద్ అబ్బాయి రాహుల్ ఏ పతకాన్ని సాధించినాడు?

ఎ) బంగారు బి) వెండి సి) కాంస్యం డి) ఏది కాదు

జవాబు : కాంస్యం

5 )   ఏఏ రంగాలల్లో విశేష సేవలు అంధించినందుకుగాను ప్రముఖ శాస్త్రవేత్త సంజీవ్ గలాండే 2014 వ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక జేడీ బిర్లా అవార్డు కు ఇటీవల ఎంపికైనారు ?

ఎ) సంఖ్యా శాస్త్రం వ్రుత్త శాస్త్రం బి) ఖగోళ శాస్త్రం,భూ అద్యయన శాస్త్రం సి)కణ జీవ శాస్త్ర,ఎపిజెనిటిక్స్ డి)ఏదీ కాదు

జవాబు :కణ జీవ శాస్త్ర,ఎపిజెనిటిక్స్

click on below links

see  for govt latest notifications

Comments are closed.

Scroll To Top
shared on wplocker.com