సెప్టెంబర్ 10, 2015 current affairs

సెప్టెంబర్ 10, 2015

కరెంట్ అఫైర్స్

గురువారం

1) కామన్వెల్త్ యూత్ గేంస్ లో సెప్టెంబర్ 10 న భారత ఆర్చర్ ప్రాచీ సింగ్ బాలికల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్లో  ఏ దేశపు ఆర్చర్ పై నెగ్గి స్వర్ణం దక్కించుకున్నరు?

ఎ) బంగ్లాదేశ్ బి) స్విట్జర్లాండ్ సి) రష్యా డి) ఏదీ కాదు

జవాబు : బంగ్లాదేశ్

వివరణ; మరో వైపు టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో శశికుమార్ ముకుంద్ , ద్రుతి వేణు గోపాల్ 7-6 , 6-3 తేడాతో మెకెలాండ్, లంస్ డెన్  (స్కాట్లాండ్) ను ఓడించి స్వర్ణం దక్కించుకునారు.   ఇక బాక్సర్ గౌరవ్ సోలంకి (52 కేజీలు) రజతం ను సాధించినాడు. అలాగే అర్చర్ నిశాంత్ ( బాలుర రికర్వ్ వ్యక్తిగత) ,స్క్వాష్ మిక్స్డ్ టీం లో సెం థిల్ కుమార్ ,హర్షిత్ జవందా లకు కూడా రజతాలు లభించినాయి, బాక్సర్లు లీచోం బన్ భీంచంద్ సింగ్ (49 కేజీ లు) ,ప్రయాగ్ ( 64 కేజీలు) కాంస్యాలు దక్కించుకున్నారు. ఓవరాల్ గా భారత్ ఈ రోజు వరకు 17 పతకాలతో ఆరొ స్థానం లో వున్నది.

2) చక్కటి పని తీరు ప్రదర్షించిన కంపనీలకు గుర్తింపుగా  ఇండియన్ ఇన్ స్టిట్యూషన్  ఆఫ్ ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్ నెలకొల్పిన ప్రతిష్టాత్మక ‘ఫెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్ అవార్డ్ 2014 ‘ కు ఇటీవల ఎంపికైన ప్రబుత్వ రంగ సంస్థ క్రింది వానిలో ఏది?

ఎ)  నేషనల్ గ్యాస్ కంపెనీ బి)  నేషనల్ అల్యూమినియం కంపెనీ సి) నేషనల్ స్టీల్ కంపెని డి) ఏదీ కాదు

జవాబు :  నేషనల్ అల్యూమినియం కంపెనీ

3) ఫార్చ్యూన్ ఇటీవల ప్రకటించిన ప్రపంచ శక్తివంతమైన వ్యాపార మహిళలు జాబితాలో స్థానం దక్కించుకున్న ఒకే ఒక భారతీయురాలు ఎవరు/

ఎ) నీతా అంబానీ బి) ఇంద్ర నూయి సి) అరుందతి భట్టాచార్య  డి) చందా కొచ్చర్

జవాబు: ఇంద్ర నూయి

వివరణ: ఫార్చ్యూన్ జాబితాలో జనరల్ మోటార్స్ సీఈవో   మేరీ బర్రా  అగ్రస్థానం లో వుండగా , ఇంద్ర నూయి రెండో స్థానం లో వున్నారు.

4) ఏ జిల్లా లో ని ఒక మార్కెట్ యార్డ్ కు చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డ్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పేరు మార్చినది?

ఎ) మహబూబ్ నగర్ బి) నల్గొండ సి) ఖమ్మం డి) మెదక్

జవాబు: మహబూబ్ నగర్

వివరణ: ఐలమ్మ 30 వ వర్ధంతి ని పురస్కరించుకుని ఇటీవల   ఈ నిర్ణయం    తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది.

 

 

 

 

 

Comments are closed.

Scroll To Top
shared on wplocker.com